Sunday, 25 January 2009
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం అక్రమాలపై సభ్యుల ఆందోళన
వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరంలో జరుగుతున్న అక్రమాలపై సభ్య జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో సభ్యులు పాలకవర్గ అవినీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా నిధుల దుర్వినియోగం, కనీసం సభ్యులకు ముందుగా తెలియజేయకుండా పెద్ద మొత్తంలో ఖర్చులు చేయడం వంటి వాటిపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గం, సభ్యుల క్షమాపణ కోరిన వరకు విషయం వెళ్లడం గమనార్హం. సుదీర్ఘకాలం పాటు పదవుల్లో కొనసాగిన ప్రస్తుత పాలక వర్గాన్ని మళ్లీ పోటీ చేయకుండా నిలువరించాలని మెజారిటీ సభ్యులు చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో తెలియదుకానీ, మొత్తానికి వి.జె.ఎఫ్.లో అక్రమాలు మాత్రం నిజమని తేలింది. (పూర్తి వ్యాసం కోసం క్లిక్ చేయండి)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment